ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ
NLR: రూరల్ నియోజకవర్గంలోని మౌజన్, ఇమామ్లకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శనివారం నెల్లూరులోని వారి నివాసంలో రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఎంపీ పార్లమెంటు సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కిట్లను తాను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు.