'వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి'
కరీంనగర్ జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షలను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆరోగ్య మహిళా ఉచిత వైద్య పరీక్షల కార్యక్రమం జరిగింది.