గణేశ్ మండపాల నిర్వాహకులకు ఈఈ కీలక సూచనలు

W.G: గణేశ్ మండపాల వద్ద విద్యుత్ లైన్‌ల భద్రతపై ఈఈ ఇంజినీర్ సాల్మన్ రాజ్ పలు సూచనలు చేశారు. మండపాల నిర్వాహకులు అధిక లోడ్, అనధికార కనెక్షన్లు వాడరాదని హెచ్చరించారు. సర్క్యూట్ బ్రేకర్లు, ISI ప్రమాణాల వైర్లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. డీబీ బాక్స్ లో MCB/ELCB అమర్చాలని, ఎల్ఈడీ లైట్లు వినియోగించాలని, విగ్రహాలు తరలించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.