VIDEO: మేళ్లచెరువులో పలువురి విద్యార్థులకు కామెర్లు

VIDEO: మేళ్లచెరువులో పలువురి విద్యార్థులకు కామెర్లు

SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో 22 మంది విద్యార్థులకు కామెర్ల వ్యాధి సోకడం కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగారు. డీఎంహెచ్‌వో ఆధ్వర్యంలో 37 మంది విద్యార్థుల నుంచి శాంపిళ్లను సేకరించారు. తాగునీరు, ఆహార పదార్థాల నాణ్యత, శానిటేషన్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.