ఇంట్లో చోరీ .. రూ.10వేలు మాయం

ఇంట్లో చోరీ .. రూ.10వేలు మాయం

KMM: నేలకొండపల్లి మండలంలోని పైనంపల్లి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. బంధువుల ఇంటికి వెళ్లిన ఒంటరి మహిళ మారగాని గోపమ్మ నివాసంలో చోరీ జరిగింది. దొంగలు ఇంటి తాళం పగలగొట్టి, బీరువాలో ఉన్న రూ.10 వేల నగదును అపహరించుకుపోయారు. బుధవారం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.