VIDEO: గౌరీపట్నంలో రహదారిపై ప్రవహిస్తున్న మురుగు నీరు
E.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుంది. బస్టాండ్‌కి సమీపంలో ఉన్న కొండగూడెం ప్రాంత వాసులుకి ఎన్నో ఏళ్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల వద్ద నీరు బయట వెళ్లే మార్గం లేక రహదారిపై ప్రవహించడం తో వాహనాలు జారీ పడిపోయే అవకాశం ఉంది. అధికారులు స్పందించి, డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు.