VIDEO: రాజుపేట వద్ద ఉద్ధృతి.. రాకపోకలు బంద్
KMM: కూసుమంచి మండలం రాజుపేట వద్ద వరద ఉద్ధృతి ప్రమాదకరంగా మారింది. పాలేరు అలుగు నుంచి 37వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండటంతో, రాజుపేట వంతెనపై సుమారు ఐదు అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పెరికసింగారం-రాజుపేట మధ్య రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. వరద పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.