నేడే సిరిమానోత్సవం.. సర్వం సిద్దం

VZM: బొబ్బిలి ప్రాంత, 12 గ్రామాలకు ఆరాధ్య దైవం శ్రీ దాడితల్లి అమ్మవారి తొలేళ్ల తంతు పూర్తయింది. అసలు సంబరానికి వేళ అయింది. కొద్ది గంటల్లో అశేష జనవాహిని అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించే సిరిమానోత్సవం ఆరంభం కానుంది. మంగళవారం మధ్యాహ్నం సిరిమాను బయలుదేరనుంది. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది.