'వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరం'

'వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరం'

NRML: వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది సూచించారు. సోమవారం ఖానాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.