ఐడీవోసీ ఉద్యోగులకు ఆరోగ్య శిబిరం
NZB: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఐడీవోసీ ఉద్యోగుల జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు రెండవ రోజు జిల్లా వైద్య అధికారి డాక్టర్ రాజశ్రీ పర్యవేక్షణలో జరిగింది. ఈసందర్భంగా 173 మంది ఉద్యోగులకు హైపర్ టెన్షన్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, క్షయ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా ఆరుగురికి క్షయ ఉన్నట్లు గుర్తించి ఉన్నత వైద్య సేవలకు రిఫర్ చేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.