రోడ్డెక్కి వస్తున్న డ్రైనేజీ నీరు
KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని జోసఫ్ పేట వద్ద గత కొన్ని నెలలుగా మురుగునీరు డ్రైనేజీ కాలువ నుంచి రోడ్డు మీదకు ప్రవహిస్తుంది. వంకవైపు వున్న కాలువ పూర్తిగా ఊడి పోవడంతో పట్టణం నుంచి వస్తున్న మురుగునీరు వంకలోకి వెళ్లకుండా రోడ్డు పైకి ప్రవహిస్తుంది. అధికారులు స్పందించి మురుగునీరు నేరుగా వంకలోకి ప్రవహించే విధంగా పూడిక తొలగించాలని స్థానికులు కోరారు.