7లోగా ఆన్‌లైన్ చేసుకున్న దరఖాస్తులు ఇవ్వాలి: ఎంపీడీవో

SRD: రాజీవ్ వికాస్ పథకం లబ్ధిదారుల ఎంపికకు కమిటీ సభ్యులతో ఎంపీడీవో సత్తయ్య సమావేశమయ్యారు. కంగ్టి మండలంలో రాజీవ్ యువ వికాస్‌లో ఇప్పటివరకు మొత్తం 1,324 దరఖాస్తులు తీసుకున్నట్లు చెప్పారు. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వనివారు(285) ఈనెల 7లోగా ఇవ్వాలన్నారు. లేదా తమ గ్రామపంచాయతీ కార్యదర్శికి అప్లికేషన్ ఫామ్స్ ఇవ్వాలని కోరారు.