నాపరాళ్ళ పరిశ్రమపై యుద్ధ ప్రభావం..!
NDL: బనగానపల్లె ప్రాంతంలో నాపరాళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. యుద్ధ ప్రభావంతో కొన్నిరోజులుగా రాళ్లకు డిమాండ్ తగ్గి, పరిశ్రమల్లో నిల్వలు పేరుకుపోయాయి. సుమారు 1100 హెక్టార్లలో విస్తరించిన గనులపై ఆధారపడి 50వేల మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. అమ్మకాలు లేకపోవడంతో యజమానులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.