కాసేపట్లో సరస్వతి పుష్కరాలకు సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి మే 26 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగనున్నాయి. అయితే మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పుష్కరాలకు హాజరై.. స్నానం ఆచరించనున్నారు. అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వరుణ్ని దర్శించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సరస్వతీ హారతి కార్యక్రమానికి రేవంత్ హాజరుకానున్నారు.