VIDEO: వైభవంగా వేంకటేశ్వర స్వామి విగ్రహాల ఊరేగింపు
NZB: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్‌లో లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఆలయంలో ప్రతిష్ఠాపన చేయనున్న విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మహిళల మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో ముందుకు కదిలారు. సీఐ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.