VIDEO: 'హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి'
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీ 1వ వార్డ్ తిమ్మాపురం జంక్షన్ వద్ద శనివారం ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఎస్సైలు బాలరాజు, సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు హెల్మెట్ వినియోగం ఎంత ముఖ్యమో వాహనదారులకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తూ ప్రయాణించాలని సూచించారు.