VIDEO: 'బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి'
VSP: BR నాయుడు టీటీడీ ఛైర్మన్ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. గురువారం ఏపీ అసెంబ్లీ వద్ద ఆమె మాట్లాడుతూ.. బీఆర్ నాయుడిపై ఒక మహిళ సీఎంకు ఫిర్యాదు చేసినా ఆయనకు పదవి ఇవ్వడం దారుణమన్నారు. భగవద్గీతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ఆ పదవిలో ఉండే అర్హత లేదని, ఆయన వచ్చాక తిరుమల కొండపై అపచారాలు పెరిగాయని విమర్శించారు.