బ్రేక్‌ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు!

బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోతే శరీరానికి శక్తి తగ్గి అలసట, బలహీనత వస్తాయి. మెదడుకు కావాల్సిన గ్లూకోజ్ అందక ఏకాగ్రత తగ్గుతుంది. జీవక్రియ నెమ్మదించి బరువు పెరిగే అవకాశం ఉంది. ఖాళీ కడుపు వల్ల గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఉదయం అల్పాహారం తప్పనిసరి.