'కొత్తవలసకు డిగ్రీ కాలేజీ, కోర్టు భవనాన్ని మంజూరు చేయండి'
VZM: కొత్తవలసలో డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విద్యాశాఖ మంత్రిని అసెంబ్లీలో కోరారు. మండలంలో ఉన్న 5 ఎకరాల స్థలంలో వెంటనే ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మంజూరు చేయాలన్నారు. అదే విధంగా, కొత్తవలసలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సివిల్ జడ్జి కోర్టు భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని సభ దృష్టికి తీసుకెళ్తూ, నిధులు మంజూరు చేయాలని కోరారు.