మార్నింగ్ వాక్‌లో సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
MHBD మున్సిపాలిటీ పరిధిలోని 27వ వార్డులో MLA భూక్య మురళి నాయక్ శుక్రవారం ఉదయం పర్యటించారు. మార్నింగ్ వాక్ చేస్తూనే స్థానికులతో ముచ్చటించి, వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం రోడ్లు, స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, శానిటేషన్, సంబంధించి మున్సిపల్ అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.