'సీసీఐ పత్తి కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలి'

WGL: సీసీఐ పత్తి కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో నేడు ఆయన మాట్లాడుతూ.. దాదాపు 1000 కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డం పెట్టుకొని కుంభకోణానికి తెరలేపిన అధికారులు నాయకుల చర్యపై సమగ్ర విచారణ ఆదేశించాలని కోరారు.