మూడు దేవాలయాల అభివృద్ధికి 7.80 కోట్లు మంజూరు

మూడు దేవాలయాల అభివృద్ధికి 7.80 కోట్లు మంజూరు

W.G: తణుకు నియోజకవర్గంలోని మూడు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. 30 శాతం ప్రజల భాగస్వామ్యంతో తణుకు మండలం వేల్పూరు రుద్రేశ్వర స్వామి ఆలయానికి రూ. 1.80 కోట్లు, దువ్వ దానేశ్వరి అమ్మవారి ఆలయానికి రూ.3 కోట్లు, రేలంగి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి రూ.3 కోట్లు చొప్పున మంజూరైనట్లు చెప్పారు.