భోజనం చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

KMM: గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మధిర మండలంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మధిర మండల కేంద్రంలోని బంజారా కాలనీకి చెందిన పుచ్చకాయల గోపిరాజు ఈరోజు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా ఛాతిలో నొప్పి ఉందంటూ కుప్పకూలిపోయి మృతి చెందినట్లు తెలిపారు.