VIDEO: వీవోఏలకు హ్యాండ్ వాష్ పై శిక్షణ
AKP: వెలుగు ఆధ్వర్యంలో వీవోఏలకు హ్యాండ్ వాష్ పై బుధవారం స్థానిక వెలుగు కార్యాలయం ఆవరణలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ మహేశ్వరరావు, వెలుగు ఏపీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భోజనం చేసే ముందు, మలమూత్ర విసర్జనకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులను నీరు సబ్బుతో పరిశుభ్రంగా కడుక్కోవాలని అన్నారు.