ఆందోలు ఎంపీవోగా రవీందర్ రెడ్డి
SRD: ఆందోలు మండల పంచాయతీ అధికారిగా రవీందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నూతన ఎంపీవోను కార్యాలయ సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.