విద్యుత్ షాక్‌తో విద్యార్థికి తీవ్ర గాయాలు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద రక్షణ కంచె లేకుండా ఉన్న 33 కె.వి ట్రాన్స్ ఫార్మర్ ప్రమాదానికి కారణమైంది. భోజన విరామ సమయంలో మూడవ తరగతి విద్యార్థి వంశీ ట్రాన్స్ ఫార్మర్ వైర్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చేతులు, కాళ్లు కాలడంతో పాటు తలకు గాయాలు అయ్యాయి. ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.