యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు

యాదాద్రి: జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ.భాస్కరరావుపై ఎలక్షన్ కమిషన్ సస్పెన్షన్ వేటు వేసింది. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అడిషనల్ కలెక్టర్‌పై వేటు పడింది. విధులకు సంబంధించి తప్పుడు నివేదిక ఇవ్వడంతో విచారణ జరిపిన ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది.