మాజీ అధ్యక్షుడు అరెస్ట్

మాజీ అధ్యక్షుడు అరెస్ట్

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సనారో అరెస్ట్ అయ్యారు. తిరుగుబాటు కుట్ర చేశారన్న అభియోగాలపై ఇప్పటికే ఆయనకు 27 ఏళ్ల శిక్ష పడింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసి, బ్రెసిలియాలోని పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తనకు పడిన శిక్షపై అప్పీల్ చేయగా ఆయనకు చుక్కెదురైంది.