VIDEO: అమరేశ్వరుడి సన్నిధిలో గాయకుడు మనో
PLD: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు మనో గురువారం అమరావతిలోని శ్రీ బాల చాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మనో గర్భాలయంలో స్వామివారిని కీర్తిస్తూ భక్తి పారవశ్యంతో ప్రత్యేక గీతాన్ని ఆలపించి, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.