టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

GNTR: నంద్యాల జిల్లాలో ఫారెస్ట్ అధికారులపై దాడి చేసిన టీడీపీ MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. తెనాలిలో శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. అధికారం ఉందని ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు చేయడం సరికాదని మండిపడ్డారు.