వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

వరద బాధితులకు ఆర్థిక సహాయం అందజేత

VZM: ఎస్.కోట మండలం కాపు సోంపురం పునరావాస కేంద్రంలో ఉన్న కుటుంబాలకు తాసిల్దార్ శ్రీనివాసరావు చేతుల మీదుగా శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. తుఫాన్ ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన 85 కుటుంబాలకు రూ.1,82,000 ఆర్థిక సహాయం అందజేసినట్లు ఆయన తెలిపారు. వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టేంతవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.