ఉమ్మడి వరంగల్‌లో పంచాయతీ ఎన్నికల హీట్
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ అన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. BRS, BJPలు ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. పార్టీలన్నీ ప్రజలను ఆకర్షించేందుకు బిజీగా ఉన్నాయి. కాంగ్రెస్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది.