VIDEO: కార్యాలయ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ విడుదల
సత్యసాయి: హిందూపురం YCP కార్యాలయం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి పార్టీ నాయకత్వం సీసీటీవీ ఫుటేజీని విడుదల చేసింది. ఘటనపై స్పష్టత కోసం మాజీ మంత్రి ఉషశ్రీ, వేణురెడ్డి తదితర నేతలు కలిసి హిందూపురం వన్‌టౌన్ సీఐకు అధికారిక ఫిర్యాదు సమర్పించారు. ఈ ఘటనకు గల బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దాడికి సంబంధించిన వివరాలను పోలీసులకు అందించారు.