VIDEO: పామూరు సమీపంలో కంటైనర్ బోల్తా
ప్రకాశం: పామూరు మండలంలోని దూబగుంట జాతీయ రహదారిపై ఓ కంటైనర్ అదుపుతప్పి బోల్తా పడింది. అద్దంకి నుంచి బెంగళూరు వెళ్తున్న కంటైనర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.