VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి రేషన్ కట్

VIDEO: అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి రేషన్ కట్

NGKL: అచ్చంపేటలో అధికారుల నిర్లక్ష్యం ఓ పేద కుటుంబానికి రేషన్ దూరం చేసింది. ఆరో తరగతి చదువుతున్న బాలికకు ఆర్టీసీలో ఉద్యోగం ఉందన్న సాకుతో అధికారులు రేషన్ కార్డును రద్దు చేశారు. రేషన్ కోసం వెళ్లిన తండ్రి మల్లేష్‌కు ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. దీనిపై కూతురు మాట్లాడుతూ.. అధికారులు స్పందించి తమ కార్డును పునరుద్ధరించాలన్నారు.