అప్పుల భారంతో కౌలు రైతు మృతి

అప్పుల భారంతో కౌలు రైతు మృతి

NDL: ఆళ్లగడ్డ ఆశ్రమం వీధికి చెందిన కౌలు రైతు చాకలి జ్వాల నరసింహుడు (45) ఆర్థిక ఇబ్బందులు, రూ. 20లక్షల అప్పులు, పంట నష్టం కారణంగా ఈ నెల 3న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.