నగరంలో మాదకద్రవ్యాలపై ఈగల్ టీం పంజా

నగరంలో మాదకద్రవ్యాలపై ఈగల్ టీం పంజా

NTR: విజయవాడలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ఈగల్ టీం పాతపాడు గువ్వలగట్టు ప్రాంతంలో మంగళవారం దాడులు నిర్వహించింది. గంజాయి సేవిస్తున్న నలుగురిని పట్టుకుని నున్న పోలీస్ స్టేషన్‌కు తరలించింది. స్వాధీనం చేసుకున్న గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.