'ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలి'
ATP: ఆర్డీటీ ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పరిగి మండల కేంద్రంలో లబ్ధిదారులు ర్యాలీ నిర్వహించారు. బుధవారం పరిగి తహశీల్దార్ హసీనాసుల్తానాకు ఆర్డీటీ లబ్ధిదారులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ గ్రామాల్లో చేస్తున్న సేవలు నిలిచిపోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.