యూట్యూబ్ ఛానల్‌పై టీడీపీ నాయకుల ఫిర్యాదు

యూట్యూబ్ ఛానల్‌పై టీడీపీ నాయకుల ఫిర్యాదు

KRNL: ఆలూరు పోలీస్ స్టేషన్‌లో నేడు టీడీపీ మండల కన్వినర్ కటారి కొండ శ్రీనివాసులు ఓ యూట్యూబ్ ఛానల్‌‌పై రాత పూర్వక ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర, కల్పిత వార్తలు ప్రసారం చేస్తున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.