యూరియా కోసం రైతన్నల కష్టాలు

యూరియా కోసం రైతన్నల కష్టాలు

NRPT: మరికల్ మండలంలోని తీలేరు సహకార సంఘంలో యూరియా దొరకక రైతులు కష్టాలు పడుతున్నారు. శుక్రవారం సహకార సంఘానికి 205 బస్తాలు యూరియా రాగా రైతులు పట్టా పాస్ పుస్తకాలను క్యూలో పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.