VIDEO: సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన
PLD: నరసరావుపేటలోని పలు కళాశాలల్లో మాదక ద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రయాణాలలో హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి అని సూచించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పుకొచ్చారు.