ప్రజా గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర

ప్రజా గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర

సత్యసాయి: అమడగూరు మండల ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులను స్వీకరించి, సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేలా అధికారులకు సూచనలు ఇచ్చారు. స్థానికులు సమస్యలను నేరుగా తెలపడంతో కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.