మున్సిపల్ పైప్ లైన్‌లో మురికి నీరు

మున్సిపల్ పైప్ లైన్‌లో మురికి నీరు

NTR: నందిగామలో డయేరియా భయం నెలకొంది. పలు ప్రాంతాల్లో విరేచనాల కేసులు నమోదవుతున్నాయి. మున్సిపల్ వాటర్ పైప్‌లైన్‌లో మురుగునీరు కలవడంతో తాగునీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. కొన్ని వార్డుల్లో నాలుగు రోజులుగా నీటి రంగు మారి రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైప్‌లైన్ మరమ్మతులు ఆలస్యమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.