నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్‌ భేటీ

నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్‌ భేటీ

AP: అమరావతిలో ఇవాళ సీఎం చంద్రబాబును టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి కలవనున్నారు. వెంకటపాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ప్రాకారం, కల్యాణోత్సవ మండపం, రాజగోపురం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం చంద్రబాబుతో వారు సమావేశం అవుతారు.