యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం: కలెక్టర్

NDL: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై యువ పారిశ్రామికవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.