తాటిచెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి

తాటిచెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి

KMM: తాడిచెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన కూసుమంచి మండలం కొత్తూరు వద్ద జరిగింది. పరిశబోయిన లక్ష్మయ్య (55) అనే కల్లుగీత కార్మికుడు కల్లు గీయడం కోసం చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఖమ్మం హస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.