VIDEO: యూరియా కోసం రైతులు పడిగాపులు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు సోమవారం రాత్రి నుంచి రైతు వేదిక వద్ద, కల్లెడ సొసైటీ వద్ద ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం యూరియా బస్తాలు వచ్చిన సమాచారం తెలుసుకొని మండలంలోని వివిధ గ్రామాల రైతులు టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు తెలిపారు. వేసిన పంటకు సరిపడా యూరియా సకాలంలో దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.