VIDEO: కలుషిత చెరువు పై చర్యలు శూన్యం..!
MDCL: ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్‌లోని చెరువు రోజురోజుకూ కలుషితంగా మారుతోంది. పరిశ్రమల రసాయనాలు, మురుగునీరు చేరడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటోంది. చెరువులో గుర్రపు డెక్క వేగంగా పెరుగుతోంది. అధికారులు ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.