గూడూరు: ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు పోలీసుల కవాతు

గూడూరు: ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు పోలీసుల కవాతు నిర్వహిస్తున్నట్లు కె.నాగలాపురం ఎస్సై ఏపీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహించడమే లక్ష్యంగా కవాతు నిర్వహించారని తెలిపారు.