స్పేస్ స్టేషన్‌లో ఏలియన్ ఎగ్?
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో నల్లటి కొమ్ములున్న వింత వస్తువు ఫొటో నెట్టింట వైరలవుతోంది. అది చూసి నెటిజన్లు ఏదో ఏలియన్ ఎగ్ అని భావించారు. అయితే అది వ్యోమగామి డాన్ పెటిట్ పెంచిన పర్పుల్ పొటాటో అని తేలింది. గ్రావిటీ లేని కారణంగా దీని వేర్లు వింతగా కనిపిస్తున్నాయని, భవిష్యత్తు అవసరాల కోసం ఈ 'స్పేస్ గార్డెన్' ప్రయోగాలు చేస్తున్నామని ఆయన వివరించారు.